- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మా ఆయనకు శృంగార స్పర్శ తప్ప మారే ఫీలింగ్ ఉండదు.. నేను రోజూ తపించిపోతున్నాను

మేడమ్! నా వివాహమై రెండు సంవత్సరాలయింది. నేను ఒక ప్రైవేటు కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా చేస్తున్నాను. నేను ఎదుటి మనిషిలో ప్రేమ, ఆప్యాయతలను వెతుక్కునే మనిషిని. నా భర్త అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఆయన తనకు శృంగారం కావాలనుకున్నపుడు మాత్రమే నన్ను స్పర్శిస్తాడు. నాకేమో అతడు నన్ను ప్రేమతో కౌగిలించుకోవాలని, నా చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకోవాలని, ఏదో ఒక కారణంతో తన స్పర్శతో నాకు దగ్గరవ్వాలని తపించి పోతాను. నాకు కావలసింది కేవలం శృంగారం మాత్రమే కాదని అతనికి ఎలా తెలపాలి?
స్వప్నా! ఒక్క నీ భర్తే కాదు. ప్రతి భర్త తన భార్య తనతో చెప్పదల్చుకున్నదేమిటో తప్పనిసరిగా వినాలి. జీవితంలో ఒక్కసారైనా సరే భార్యకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవటంతో పాటుగా, కేవలం శృంగార వాంఛ కలిగినప్పుడు మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా తన భావోద్వేగాలను, ప్రేమాప్యాయతలను స్పర్శ ద్వారా భార్యకు తెలియ చేయవచ్చు. చాలా మంది భర్తలకు భార్యల మీద ప్రేమ ఉన్నా దానికి వ్యక్తం చేయరు. కారణం ఇవన్నీ వారికి చిన్న విషయాల్లా కనిపించడమే.
భార్య ఇతర పనుల్లో ఉన్నప్పుడు ఆమెకు సహాయం చేస్తూనే, చిన్న స్పర్శల ద్వారా 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పొచ్చు. స్పర్శ ఎన్నో సందేశాలను దంపతుల మధ్య మోస్తుంది. శృంగారవాంఛతో సంబంధం లేని ప్రేమైక స్పర్శను ఎందరు భర్తలు భార్యలకు ఇవ్వ గలుగుతున్నారు? అలాగని శృంగారాన్ని తక్కువ చేయడం కాదు. శృంగారం దంపతుల మధ్య ప్రేమను వ్యక్తపరచే ఒక అందమైన వ్యక్తీకరణ. శరీరం ఒక మాధ్యమం మాత్రమే.
శృంగారం ఒక అద్భుతమైన దేహ భాష. దంపతుల మధ్య ప్రేమనీ, ఆప్యాయతనూ, పరస్పర రక్షణనూ, నమ్మకాలతో కూడిన వాగ్ధానాన్నీ చేసే ప్రణయ కావ్యం. శృంగారం కేవలం స్త్రీ పురుష జననాంగాలకు సంబంధించిన విషయమే కాదు. దేహాల ద్వారా హృదయానికి చేరే భావోద్వేగాల వినిమయం. శృంగారంలో మనసు, శరీరాల సమన్వయం ముఖ్యం, కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. 'బయట ప్రపంచానికి భార్యాభర్తల మధ్య మనస్పర్థలుగా కనిపించే చాలా సమస్యలకు, ఇదే కారణంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్లే స్త్రీ పురుష సంబంధాలు చాలా శుష్కంగా మిగిలిపోతున్నాయి. ఆధిపత్యంతోనో, అహంకారంతోనే ఎదుటి మనిషి మనసును దోచుకోవడం అసాధ్యం. ముందు మీ భర్తకి మీ ప్రేమను స్పర్శ ద్వారా వ్యక్తీకరించండి. ప్రేమించడం ఎలానో నేర్పండి. తననుంచి మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్