- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కీలక పరిణామం.. 40% మరణ ప్రమాదాన్ని తగ్గించే ఔషదానికి ఆమోదం
మహిళలను భయపెడుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్ (Brest cancer)చికిత్సకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ లో వ్యాధిని తగ్గిస్తూ,మరణ ప్రమాదాన్ని 40శాతం తగ్గిస్తున్న ఇన్లురియో (Inluriyo) అనే డ్రగ్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమెదం లభించింది.

దిశ, వెబ్ డెస్క్: మహిళలను భయపెడుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్ (Brest cancer)చికిత్సకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ లో వ్యాధిని తగ్గిస్తూ,మరణ ప్రమాదాన్ని 40శాతం తగ్గిస్తున్న ఇన్లురియో (Inluriyo) అనే డ్రగ్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమెదం లభించింది. అడ్వాన్స్డ్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో ఈ డ్రగ్‌తో మంచి ఫలితాలు వచ్చినట్టు క్లినికల్ ట్రయల్స్‌లో గుర్తించారు. ఈ సందర్భంగా ఫార్మాసిటికల్ దిగ్గజం శ్రీలి లిల్లి ఇన్లురియో మందుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
దీనిని నోటి ద్వారా రోజుకు ఒకటి చొప్పున అందిస్తారని చెప్పారు. ఈ డ్రగ్ వినియోగించడం వల్ల మరణాల రేటు దాదాపు 40 శాతం తగ్గిందని తెలిపారు. ఈస్ట్రోజన్ రిసెప్టార్‌కు ఇది విరోధిగా పనిచేస్తుందని, చివరి స్టేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్నవారిలో సైతం మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. హార్మోనల్ థెరపీ తీసుకున్నవారు కూడా దీనిని తీసుకోవచ్చన్నారు. మూడవ దశ EMBER-3 ట్రయల్స్ లో ఎండోక్రేన్ థెరపీతో పోలిస్తే ఇన్లూరియో క్యాన్సర్ పురోగతి లేదా మరణ ప్రమాదాన్ని తగ్గించిట్టు తేలిందన్నారు. ఇతర క్యాన్సర్ మందులతో పోలిస్తే ఈ డ్రగ్ చికిత్సలో మెరుగైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఇక వారం రోజుల్లో ఇది అమెరికా మార్కెట్ లోకి అందుబాటులో రానుంది.






