- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుషులు వారం రోజులు హస్త ప్రయోగం చేయకపోతే ఏమవుతుందో తెలుసా? సంచలన విషయాలు బయటపెట్టిన రీసెర్చ్
శృంగారం.. మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యానికి కూడా కీలకమని ఇంతకు ముందే చెప్పారు శాస్త్రవేత్తలు. పలు అధ్యయనాల ద్వారా రుజువు చేశారు. అయితే హస్తప్రయోగం ఎలా ప్రభావితం చేస్తుందనేదానిపై స్టడీ

దిశ, ఫీచర్స్ : శృంగారం.. మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యానికి కూడా కీలకమని ఇంతకు ముందే చెప్పారు శాస్త్రవేత్తలు. పలు అధ్యయనాల ద్వారా రుజువు చేశారు. అయితే హస్తప్రయోగం ఎలా ప్రభావితం చేస్తుందనేదానిపై స్టడీ చేసిన సైంటిస్టులు.. వారం రోజుల పాటు దీనికి దూరంగా ఉంటే టెస్టోస్టెరాన్ లెవల్స్ 45.7శాతం గణనీయంగా పెరుగుతాయని గుర్తించారు. ఈ కార్యకలాపాలకు దూరంగా ఉన్న పురుషుల సమూహంలోని టెస్టోస్టెరాన్ లెవల్స్ ప్రతిరోజూ చెక్ చేసిన వారు.. వారంలో చాలా రోజులు టెస్టోస్టెరాన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు చాలా తక్కువగా ఉన్నాయని, కానీ ఏడో రోజు మాత్రం టెస్టోస్టెరాన్ స్థాయిలు వారి సాధారణ స్థాయిలతో పోలిస్తే దాదాపు యాభై శాతం గణనీయంగా పెరిగినట్లు కనుగొన్నారు.
టెస్టోస్టెరాన్ ఎందుకు?
టెస్టోస్టెరాన్ స్థాయిలు కేవలం లైంగిక ఆసక్తిని మాత్రమే కాకుండా.. ఇతర ముఖ్యమైన అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ ప్రకారం టెస్టోస్టెరాన్ మన శరీరంలో ప్రోటీన్ సంశ్లేషణను పెంచడం ద్వారా కండరాల పెరుగుదల సామర్థ్యాన్ని పెంచుతుంది. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు జుట్టు రాలడం, బరువు పెరగడం, మరియు ఎముకల సాంద్రత తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
ఏడు రోజుల తర్వాత ఎందుకు పెరుగుతుంది?
ఖచ్చితంగా ఏడు రోజుల తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయనేది స్పష్టంగా తెలియలేదు. అయితే టెస్టోస్టెరాన్‌ను పెంచడానికి సురక్షితమైన మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటి పద్ధతులను పరిగణించవచ్చు. బోస్టన్ యూనివర్శిటీ పరిశోధన ప్రకారం తరచూ వీర్యస్ఖలనం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. కాబట్టి టెస్టోస్టెరాన్‌ను పెంచడానికి లైంగిక కార్యకలాపాల నుంచి దూరంగా ఉండటం ఉత్తమ మార్గం కాకపోవచ్చు.






