- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సమస్యతో ఇప్పటికే 5 ఆపరేషన్లు..! పెళ్లి చేసుకోవాలా.. వద్దా ?
హైపోస్పాడియాసిస్‌లో అంగం వంకరగా ఉండడంతో పాటుగా మూత్ర రంధ్రం ఉండాల్సిన చోట కాకుండా అంగం కింద, పక్కల ఉండి వీర్యస్ఖలనం అయినప్పుడు, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా ఉంటుంది.

ప్రశ్న: మేడం.. నా వయసు 27 సంవత్సరాలు. నాకు పుట్టినప్పటి నుంచి హైపోస్పా డియాసిస్ సమస్య ఉంది. నా పురుషాంగం యు ఆకారంలో చిన్నగా లోపలికి వంగి ఉండేది. మాది చాలా పేద కుటుంబం కావడం వల్ల హాస్పిటల్లో చూపించలేదు. 17 సంవత్సరాల వయసులో ఒక ఉచిత వైద్యశాలలో చూపిస్తే ఐదు దశలలో ఆపరేషన్ చేశారు. అవి పూర్తి అయ్యేసరికి నా వయస్సు 21 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పుడు నా సమస్య ఏమిటంటే నా అంగం నాలుగు సెంటీమీటర్లు మాత్రమే ఉంది. స్తంభించిన తర్వాత 6 సెంటీమీటర్లు ఉంటుంది. లావు కూడా తక్కువగా ఉంది. సెక్స్ చేయడానికి పురుషాంగం పరిమాణానికి సంబంధం ఉందా ? నేను పెళ్లికి పనికి వస్తానా ? - నరసింహా, నాగార్జున సాగర్
జవాబు: హైపోస్పాడియాసిస్‌లో అంగం వంకరగా ఉండడంతో పాటుగా మూత్ర రంధ్రం ఉండాల్సిన చోట కాకుండా అంగం కింద, పక్కల ఉండి వీర్యస్ఖలనం అయినప్పుడు, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా అంగప్రవేశం చాలా కష్టమవుతుంది. దీనికి 5 దశల్లో ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడిన ఆపరేషన్. నువ్వు అదృష్టవంతుడివి.. ఎందుకంటే ఉచితంగా అయిదు దశల ఆపరేషన్ అయిపోయింది. అసలు సమస్య తీరిపోయింది కానీ, నీ అపోహల వల్ల ఆందోళన, భయాలతో కొత్త సమస్యల్లో కూరుకుపోతున్నావు. నిజానికి అంగం గట్టిపడక ముందు 3.9 ఇంచులు అంటే ఏడు నుంచి పది సెంటీమీటర్లలోపు ఉంటుంది. గట్టిపడినాక అంటే భార్యపైన కోరిక కలిగినప్పుడు నాలుగు నుంచి ఏడు అంగుళాలు అంటే 12 నుంచి 16 సెంటీమీటర్లు ఉంటుంది. నీకు అంతా నార్మల్ గానే ఉంటుంది. అనవసరంగా ఆందోళన పడుతున్నావు. అంగపరిమాణం ముఖ్యం కాదు.. సంతృప్తి పరచడమే ముఖ్యం. ఆపరేషన్ తర్వాత నీ అంగం సైజు నార్మల్‌గా అయిపోయింది. 100% నీ భార్యని పూర్తిగా సంతృప్తి పరచగలవు. హాయిగా పెళ్లి చేసుకో.
డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






