- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sex Education : పీరియడ్స్ తర్వాత ఎన్ని రోజులకు సెక్స్‌లో పాల్గొంటే పిల్లలు పుడతారు?
Sex Education : పీరియడ్స్ తర్వాత ఎన్ని రోజులకు సెక్స్‌లో పాల్గొంటే పిల్లలు పుడతారు?

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో శృంగారం ఒక ముఖ్యమైన భాగం. భార్యా భర్తలు సంతోషంగా ఉండాలంటే.. లైంగిక విషయాలపట్ల అవగాహన అవసరం. లేకపోతే అపార్థాలకు, సంసార జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ భారతి. లైంగిక విషయాలపట్ల పాఠకులు అడిగిన పలు సందేహాలకు వారు చెప్పిన సమాధానాలేమిటో ఇప్పుడు చూద్దాం.
1. మేడం నాకు పెళ్లై ఆరు సంవత్సరాలైంది. వయసు 28 సంవత్సరాలు నా భర్తకి 30 సంవత్సరాలు. ఇంకా పిల్లలు కాలేదు. చాలా హాస్పిటల్స్ తిరిగాం. అన్ని పరీక్షలు చేయించుకున్నాం. ఏ సమస్య లేదన్నారు. ఇంట్లో అత్తగారు సూటి పోటి మాటలు మాట్లాడుతున్నారు నాకు పీరియడ్స్ వచ్చిన ఎన్ని రోజులకు సెక్స్‌లో పాల్గొనాలి? అండాలు ఏ టైమ్‌లో విడుదలవుతాయి? తెల్లవారుజామున 4 నుంచి 6 మధ్య కలిస్తే మంచిదని తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఇది నిజమా? నేను రోజు పడుకునేసరికి రాత్రి 11 అవుతుంది. ఆ తర్వాత సెక్స్‌లో పాల్గొంటే ఏమైనా సమస్యా? అందుకే మాకు పిల్లలు కలగడం లేదా దయచేసి నా బాధను అర్థం చేసుకొని మంచి సలహా ఇవ్వండి. - ఎం.ఆర్.పి.నిజామాబాద్.
జవాబు: చాలాసార్లు దంపుతుల్లో ఏ లోపం లేకపోయినా పిల్లలు త్వరగా పుట్టరు. స్త్రీలలో అండం విడుదల సరిగ్గానే ఉన్నా ఆరోగ్యవంతంగా లేనప్పుడు, పురుషులలో వీర్యకణాలు పుష్కలంగా ఉండి కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే అండం విడుదల అయ్యే సమయంలో కలవకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా అండం విడుదలయ్యే తేదీలను మార్చి వేస్తుంది. అండం విడుదల అయ్యే రోజులను ‘ఫర్టీలిటీ పీరియడ్’ అంటారు. నెలసరి మొదలైన మొదటి రోజు నుంచి 12 రోజులు లెక్కపెడితే 12వ రోజు నుంచి 16వ రోజు మధ్యలో అండం విడుదలవుతుంది. ఆ రోజుల్లో దంపతులు ఆందోళన లేకుండా ప్రశాంతంగా కలవాలి. ఎందుకంటే ఆందోళన వల్ల అండం విడుదల కాదు. పురుషులలో అంగస్తంభన సమస్య వస్తుంది. అలాగే శృంగారంలో పాల్గొనేకంటే ముందే భార్య మూత్ర విసర్జనకు వెళ్లిరావాలి. ఎందుకంటే శృంగారం ముగిసిన వెంటనే లేవకూడదు. మూత్ర విసర్జనకు వెళ్లకూడదు, జననాంగాలు శుభ్రం చేసుకోకూడదు. ఇక శృంగారంలో పాల్గొనేటప్పుడు ఒక దిండును భార్య నడుము కింద పెట్టి వీర్య స్ఖలనం కానిస్తే.. వీర్యం త్వరగా గర్భాశయంలోకి వెళ్ళిపోతుంది. అరగంటలో వీర్యం బయటకు వస్తుందని కంప్లైంట్ ఉన్నవాళ్లు ఈ పద్ధతిని పాటించవచ్చు. నిజానికి దిండు పెట్టకపోయినా వీర్యంలో ఒట్టి నీరు మాత్రమే బయటికి వస్తుంది. వీర్యకణాలు ఈదుకుంటూ గర్భాశయంలోకి అండం వైపుగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ పద్ధతులు పాటించండి.
2. మేడం మాకు పెళ్లై నాలుగు సంవత్సరాలవుతోంది. నాకు 34 సంవత్సరాలు, ఆమెకి 30 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మునపటి మాదరి సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నాంజ. అంగప్రవేశమైన వెంటనే అంగం మెత్తబడుతుంది. అసలు నాకు పిల్లలు పుడతారా? దృఢమైన అంగస్తంభన ఎందుకు కలగడం లేదు? నా సమస్యకు పరిష్కారం ఏమిటి? సరిగ్గా సెక్స్ చేయలేకపోవటమేనా? పిల్లలు కలుగకపోవడానికి కారణం ఏమిటి?
-ఎస్.బి.ఎం వికారాబాద్ .
జవాబు : మీకు సమస్య అంగస్తంభన లోపం ఉన్నట్లున్నది. ఒకవేళ అంగప్రవేశం తర్వాత అంగం మెత్తబడి వీర్య స్ఖలనం అయితే, వీర్యకణాలు బాగుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. మీరు అంగస్తం భన సమస్యను పరిష్కరించుకోవాలి. అయితే ఈ సమస్యకు శారీరక కారణాలు ఉన్నాయా లేదా అనేది రక్త పరీక్ష, డాప్లర్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది చేయించుకోవచ్చు. బీపీ, గుండె జబ్బులు షుగర్, నరాలు, లివర్, కిడ్నీ సమస్యలు సెక్స్ హార్మోన్ సమస్యలు ఉంటే అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీది మానసిక కారణాల వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య అయితే సెక్సాలజిస్ట్‌ను కలవండి మీది ‘పెనట్రేషన్ ఫోబియా’ కూడా కావచ్చు. అంటే అంగప్రవేశం చేసే ముందు విపరీతమైన భయాందోళన వల్ల కూడా ముందే మెత్తబడిపోవచ్చు. ఒకసారి వీర్య పరీక్ష కూడా చేయించుకోండి. మీ భార్య కూడా మీతో పాటు పెల్విస్ స్కానింగ్ చేయించుకోవాలి.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






