Personal life : ఆ కోరికలైతే లేవు.. పెళ్లి చేసుకోవాలా.. వద్దా ?

by Javid Pasha |

ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే జీవితాంతం వెంటాడే సుఖ వ్యాధులు రావొచ్చు.

Personal life : ఆ కోరికలైతే లేవు.. పెళ్లి చేసుకోవాలా.. వద్దా ?
X

ప్రశ్న: మేడం.. నాలుగేండ్ల క్రితం వ్యాయామం చేస్తుంటే జరిగిన పొరపాటు వల్ల ఎడమ వృషణం చిన్నగా మారి నొప్పి పుట్టింది. టాబ్లెట్లు వాడితే తగ్గింది. తర్వాత యూరాలజిస్ట్ కి చూపించాను. రెండు వృషణాలకి వెరికోసిల్ ఉందని దాని ద్వారా పిల్లలు పుట్టరని చెప్పాడు. ఇప్పుడేమో నాకు సెక్స్ కోరికలు కలగడం లేదు. ఇంతకుముందు తెల్లవారుజామున అంగస్తంభన వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కానీ సెక్స్ కోరికలు లేవు.. అంగం స్తంభించడం లేదు.. నేను పెళ్లికి పనికి వస్తానా ? - రాజసుందరం, ఏలూరు

జవాబు : నీకు వరిబీజం ఉంది. దానివల్ల పిల్లలు పుట్టరంటే నువ్వు భయాందోళనకు లోనై డిప్రెషన్ లోకి వెళ్లిపోయావు. వరి బీజం ఏ దశలో ఉంది ? మూడవ దశలో ఆపరేషన్ చేస్తే వీర్యకణాలు, సెక్స్ హార్మోన్లు వృద్ధి అయి పిల్లలు పుట్టే అవకాశంతో పాటు అంగస్తంభన కూడా వృద్ధి అవుతుంది. నువ్వు ఇంకొక యూరాలజిస్ట్ అని కలిసి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది. వ్యాధి మీద అపోహాలతో డిప్రెషన్ లోకి వెళ్లడం వల్ల కూడా సెక్స్ హార్మోన్లు, అంగస్తంభనలు తగ్గుతాయి. నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నీ లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే జీవితాంతం వెంటాడే సుఖ వ్యాధులు రావొచ్చు. ప్రమాదకరమైన హెచ్ఐవీతో ప్రాణం మీదికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ సమస్యకు పరిష్కారం.. సీనియర్ యూరాలజిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలాగే సెక్సాలజిస్ట్ నీ కలిసి ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి.

డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story