- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ‘గే’నా? ఎందుకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ కలగట్లేదు?
నాకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఎందుకు వస్తలేవు? నేను కానీ గేనా? నా చిన్నప్పటి పరిస్థితులు ఇందుకు కారణం కావొచ్చా? నాలో సమస్య ఉందా లేదనేది ఎలా తెలుస్తుంది?

దిశ, ఫీచర్స్ : మేడం నమస్తే! నాది వింత సమస్య. నా వయసు 30 సంవత్సరాలు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నాకు అమ్మాయి మీద సెక్స్ ఫీలింగ్స్ రావట్లేదు. నాకు 12 ఏళ్లప్పుడు నా మీద పదో తరగతి చదువుతున్న పిల్లాడు అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి నుంచి నాకు నేను అమ్మాయిని అన్న అనుమానం కలగసాగింది. కానీ ఎప్పుడూ అబ్బాయిలతో సంబంధంలో లేను. మరోవైపు అమ్మాయిలంటే ఆసక్తి కలగటం లేదు. నాకు భయంగా ఉంది. నేను గే నా.. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరి లాగా భార్యా పిల్లలతో ఉంటానా? నా కోరిక పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలనేది. కానీ నన్ను ఈ భయాలు తినేస్తున్నాయి. నేనేం చేయాలో తెలియక సతమతమవుతున్నా. సైకియాట్రీస్ట్ రాసిన మందులు వాడినా తగ్గట్లేదు. ఏం చేయమంటారు? - సైకత్, నిజామాబాద్
సైకత్.. మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే.. నువ్వు ‘Gay’ కాదని బలంగా నమ్మడం. నీ సుదీర్ఘమైన లెటర్‌లో ఎక్కడా నీకు ఒక్క గే లక్షణం కూడా లేదు. బాల్యంలో నీ మీద మరొక పిల్లవాడు చేసిన లైంగిక అత్యాచారం వలన నువ్వు నిన్ను ఒక బలహీనమైన మనిషిగా.. అతను బలాన్ని ఉపయోగించి ఒక స్త్రీని చేసినట్లు రేప్ చేసాడు. కాబట్టి నీకు అలాంటి భయంతో కూడిన అనుమానం కలుగుతోంది తప్ప నువ్వు గే కావడం వల్ల కాదు. ‘గే’లు కాని మగపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతాయి. నీతో జరిగింది ఇదే. దానికి నీవు నీ సెక్సువల్ అస్థిత్వాన్ని అనుమనించకూడదు. అశాస్త్రీయ జ్ఞానం, భయం, అనుమానం, ఆందోళన, అపనమ్మకం వల్ల కూడా నీకు అనుమానాలు వస్తాయి. అవి నీలో స్త్రీల పట్ల సహజంగా రావాల్సిన, కలగాల్సిన ఇష్టాన్ని ఆపే అవకాశం ఉంది. నువ్వు చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి భర్తగా పిల్లాపాపలతో ఉండొచ్చు. అయితే ఈ భయాలు, అపనమ్మకాలు పోగొట్టుకుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. నువ్వు కౌన్సిలింగ్, సైకోథెరపీ, సైకో-సెక్సువల్ థెరపీ తీసుకోవాలి. హార్మోనల్ ప్రొఫైల్ టెస్ట్స్ చేయించుకోవాలి. మంచి సెక్సాలజిస్టుని కలువు.






