- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భం రావాలంటే భార్యాభర్తలు ఏ రోజుల్లో కలవాలి?
పిల్లలు కనేందుకు ప్రతీ స్త్రీ ఆరాటపడుతుంది. అయితే సంతానోత్పత్తి కలగాలంటే భర్తతో ఏ రోజు కలవాలి? పీరియడ్ అయ్యాక ఎన్ని రోజులకు భర్తతో శృంగారంలో పాల్గొనాలి? అనే విషయంపై కూడా ఫెర్టిలిటీ రేట్ ఆధారపడుతుంది. ఈ సందేహంపై పూర్తి వివరాలు 9వ పేజీలో

దిశ, ఫీచర్స్ : నమస్తే డాక్టర్.. నాకు ఒబేసిటీ.. 75 కిలోలు ఉన్నా.. పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు కూడా ఉన్నాయి. నా వయసు 25. వివాహమై తొమ్మిది నెలలు అవుతోంది. గర్భం రావాలంటే నా భర్తతో ఏ రోజుల్లో కలవాలి... మహేశ్వరి, కామారెడ్డి
ముందు మీరు మీ బరువు తగ్గాలి. అధిక బరువు వల్ల అండం నెల నెలా విడుదల కాదు. కొన్ని సార్లు అసలు విడుదల కాదు. కాబట్టి పిల్లలు పుట్టడానికి ఫెర్టిలిటీ సమయం అంటే అండం విడుదల అయ్యే సమయం, తేదీలు చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి మొదట మీరు బరువు తగ్గడానికి వెంటనే యోగా, వాకింగ్, డైటింగ్ మొదలుపెట్టండి. న్యూట్రిషనిస్ట్‌ను కలవండి. తరువాత నెలసరి సరిగ్గా వస్తుంది. ఆ సమయంలో అంటే మీ 28-30 రోజుల ఋతుక్రమం అవుతూ ఉంటే నెలసరి స్టార్ట్ అయిన 12వ రోజు నుంచి 20 రోజుల మధ్యలో కలుస్తే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక థైరాయిడ్ పరీక్షలు రెగ్యులర్‌గా చేయించుకుంటు, మందులు రెగ్యులరుగా వాడుతూ ఉండాలి. ఎందుకంటే థైరాయిడ్ సమస్యకి, ఇన్ఫెర్టిలిటీకి సంబంధం ఉంది. ఇంకో విషయం ఏంటంటే... మీ భర్త వీర్యకణాల సంఖ్య, వాటి ఆరోగ్య స్థితికి సంబంధించి సెమెన్ ఎనాలిసిస్ చేయించడం కూడా ముఖ్యం.






