నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయులకు పండగే పండగ!

by  |
నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయులకు పండగే పండగ!
X

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో భారతీయ కంటెంట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. జనాభా ఎక్కువగా ఉండటం, కంటెంట్‌లో నాణ్యత ఉండటం వల్ల ఒకదాని వెనక ఒకటిగా సినిమాలు, టీవీ షోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సేక్రెడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్ వంటి కార్యక్రమాలు గొప్ప విజయాన్ని అందుకోవడంతో స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్, భారతీయ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయడం మీద ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ ప్రత్యేక శ్రద్ధకు తగిన ఫలితం త్వరలో రాబోతోంది. తమ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతున్న 17 భారతీయ కార్యక్రమాలకు సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ కార్యక్రమాల్లో 12 సినిమాలు, ఐదు టీవీ షోలు ఉన్నాయి. వీటిలో అనిల్ కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాజ్ కుమార్ రావ్ వంటి దిగ్గజ నటులతో పాటు ప్రజక్తా కొళీ లాంటి బడ్డింగ్ యూట్యూబర్లు, ఇంకా తమ నటనా చాతుర్యం చూపిస్తున్న కొత్త ముఖాలెన్నో ఉన్నాయి. ఒకసారి ఆ 17 ఏంటో తెలుసుకుంటే విడుదలవగానే చూసేయొచ్చు.

ఈ జాబితాలో అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ‘లూడో’ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావ్, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి నటించారు. ఇంకా సంజయ్ దత్ నటించిన టోర్బాజ్.. రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన రాత్ అకేలీ హై, భూమీ ఫడ్నేకర్, కొంకణా సేన్ శర్మ నటించిన డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే సినిమాలతో పాటు బాంబే రోజ్, జిన్నీ వెడ్స్ సన్నీ, గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్, త్రిభంగా – తేడీ మేడీ క్రేజ, కాళీ ఖుహీ, సీరియస్ మెన్, క్లాస్ ఆఫ్ 83, ఏకే వర్సెస్ ఏకే కూడా ఉన్నాయి. ఇక ఒరిజినల్ టీవీ షోస్ విషయానికి వస్తే మిస్‌మ్యాచ్‌డ్, ఎ సూటబుల్ బాయ్, మసాబా మసాబా, బాంబే బేగమ్స్, భాగ్ బీనీ భాగ్ ఉన్నాయి. వీటిన్నింటి ఫస్ట్ లుక్ ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌లో చూడొచ్చు.



Next Story