ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం

by  |
ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తితో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నడుంబిగించారు. రూ. 40లక్షల సొంత డబ్బులతో పదివేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా వీటన్నింటినీ అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఛైర్మన్ కార్తీక్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. కుటుంబానికి 5కిలోల బియ్యం, కిలో పప్పు, అరకిలో చింతపండు, కిలో నూనెను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు చిన్న సాయం చేయాలనే ఆలోచనతోనే నిత్యావసరాల పంపిణీ చేపట్టినట్లు ఇంద్రన్న ట్రస్ట్ ఛైర్మన్ కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. చిరు సహాయాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కేసీఆర్ సీఎంగా ఉండటం అదృష్టం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ముందు జాగ్రత్త చర్యలతో రాష్ట్రంలో కట్టడి చేయగలిగామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి గొప్ప నాయకులు సీఎంగా ఉండటం ప్రజల అదృష్టం అన్నారు. ఎవ్వరూ ఆకలితో ఉండొద్దనే ఉద్దేశ్యంతో 87లక్షల మందికి 12కిలోల బియ్యం, రూ.1500 నగదు అందిస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటు 3లక్షల 35 వేలకు పైగా వలస కార్మికులను గుర్తించి వారికి ఒక్కొక్కరికి12 కిలోల బియ్యం తో పాటు, 500 నగదు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటను కొనాటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 38, 770 ఎకరాల్లో పండించిన 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 30వేల ఎకరాల్లో 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారు.

Tags: Corona Virus, Lockdown, Indranna Seva Trust, Minister Sabitha, Karthik Reddy, Maheshwaram Constituency, Vikarabad, Rangareddy


Next Story

Most Viewed