లాంగ్వాల్‌లో గోడకూలి సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు

by Batti.Sumithra |

<p>దిశ, భూపాలపల్లి : బొగ్గుగనిలో పనిచేస్తున్న యువకుడికి ప్రమాదశాత్తు తీవ్ర గాయలైన ఘటన జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని కాకతీయ లాంగ్వాల్‌ ప్రాజెక్టులో చోటు చేసుకుంది. కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు గోడ కూలి శనివారం రాత్రి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న నవీన్ అనే హాలర్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన నవీన్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సింగరేణి అధికారులు లాంగ్వాల్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి [&hellip;]</p>

లాంగ్వాల్‌లో గోడకూలి సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు
X

దిశ, భూపాలపల్లి : బొగ్గుగనిలో పనిచేస్తున్న యువకుడికి ప్రమాదశాత్తు తీవ్ర గాయలైన ఘటన జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని కాకతీయ లాంగ్వాల్‌ ప్రాజెక్టులో చోటు చేసుకుంది. కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు గోడ కూలి శనివారం రాత్రి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న నవీన్ అనే హాలర్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన నవీన్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సింగరేణి అధికారులు లాంగ్వాల్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉండగా, రక్షణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించినందుకే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు అంటున్నారు.

ప్రమాదం జరిగిన అనంతరం అధికారులు రక్షణ గురించి హడావిడిగా చర్యలు తీసుకుంటారని, ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదని కార్మికులు అంటున్నారు. కోట్లాది రూపాయల లాభాలు తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తున్న సింగరేణి కార్మికుల రక్షణ పట్ల అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

Next Story