AP News: సినీ ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై టికెట్లు నేరుగా..!

by  |
AP News: సినీ ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై టికెట్లు నేరుగా..!
X

దిశ, ఏపీబ్యూరో : సినిమా టికెట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల బుకింగ్‌ కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం జీవోను విడుదల చేసింది. సినిమా థియేటర్స్‌లో టికెట్లు విక్రయించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందని జీవోలో తెలిపింది.

ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ మేరకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా.. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కో-చైర్మన్‌గా నియమించారు. దాంతో పాటే ఈ కమిటీలో ఆరుగురు సభ్యులను నియమించారు.


Next Story

Most Viewed