మళ్లీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు!

by  |
మళ్లీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి నష్టాల్లోకి జారాయి. గత రెండు వారాల నష్టాల తర్వాత సోమవారం కోలుకుంటున్న సంకేతాలు కనిపించినప్పటికీ మంగళవారం మళ్లీ పతనమయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన కాసేపటికే సూచీలు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 112.16 పాయింట్లను కోల్పోయి 60,433 వద్ద, నిఫ్టీ 24.30 పాయిట్ల నష్టంతో 18,044 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫైనాన్స్ ఇండెక్స్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్ రంగాలు బలహీనపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, హెల్త్‌కేర్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టాటా మోటర్స్, హీరో మోటర్ కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్రిటానియా, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.07 వద్ద ఉంది.


Next Story

Most Viewed