వరుస రికార్డుల జోరుకు బ్రేక్.. మెటల్ కి తప్పని నష్టాలు

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస రికార్డుల జోరుకు బ్రేక్ పడింది. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్ నిర్ణయాలకు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్త పడటంతో సూచీలకు వరుస నాలుగు సెషన్ల తర్వాత నష్టాలు ఎదురయ్యాయి విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనపడటం, ఇటీవల రికార్డు గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీటికితోడు మెటల్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 271.07 పాయింట్లు కోల్పోయి 52,501 వద్ద, నిఫ్టీ 101.70 పాయింట్ల నష్టంతో 15,767 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 3 శాతం పతనమవగా, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు దెబ్బతిన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలలో కొంతమేర కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్‌సెర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.31 వద్ద ఉంది.

దేశీయ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు బుధవారం కూడా నష్టపోయాయి. మూడు విదేశీ కంపెనీల పెట్టుబడి ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టు వచ్చిన వార్తల ప్రభావం ఆయా సంస్థల షేర్లపై ఇంకా కొనసాగుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోబ్ బుధవారం ట్రేడింగ్‌లో 3.3 శాతాం క్షీణించాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్ షేర్లు ప్రతికూలంగా ర్యాలీ అయ్యాయి.


Next Story