లాభాల స్వీకరణతో నష్టపోయిన సూచీలు..

by  |
లాభాల స్వీకరణతో నష్టపోయిన సూచీలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గరిష్ట లాభాల తర్వాత తిరిగి వెనక్కి దిగజారుతున్నాయి. ప్రధానంగా ఇటీవల దక్కించ అత్యధిక లాభాల నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు బుధవారం అధిక నష్టాలను ఎదుర్కొన్నాయని విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 333.93 పాయింట్లు కోల్పోయి 51,941 వద్ద ముగియగా, నిఫ్టీ 104.75 పాయింట్లు నష్టపోయి 15,635 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో రంగాలు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ప్రధానంగా ఫైనాన్స్, ఆటో రంగాల్లో అమ్మకాల జోరు బుధవారం నాటి మార్కెట్ల నష్టాలకు కారణమని మార్కెట్లు వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎల్అండ్‌టీ, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.95 వద్ద ఉంది.



Next Story

Most Viewed