బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు

197

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్‌లో భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తాన్ని పోలీసులు చేర్చారు. కిడ్నాప్‌ తతాంగంలో భార్గవ్ ఫ్యామిలీ కూడా సాయం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో భార్గవ్ పేరెంట్స్, తమ్ముడు చంద్రహాస్, బావమరిది భూమా జగత్‌‌ విఖ్యాత్ పేర్లను ఎక్కించారు. అయితే, కిడ్నాప్‌ ప్లాన్ నుంచి నిందితులు పారిపోయే వరకు.. వీరి హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో విచారణను ముమ్మరం చేశారు. అయితే, ఇదే కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియ కస్టడీ పూర్తి చేసుకొని.. 14 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.