సీనియర్ దర్శకుడు కన్నుమూత..

by  |
సీనియర్ దర్శకుడు కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు, నటుడు ఓఎస్ఆర్ ఆంజనేయులు(79) మరణించారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందారు. దీంతో ఆయన మృతి పట్ల అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నాటకరంగం అంటే ఎంతో మక్కువ చూపేవాడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంజనేయులు అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సహా చాలా మంది సీనియర్ హీరోలతో కలిసి పని చేసాడు ఆంజనేయులు. నటుడిగా కంటే కూడా ముందుగా దర్శకుడిగా సత్తా చూపించాడు. కృష్ణ, విజయనిర్మల, వీ.రామచంద్రరావు, కే.హేమాంబదరరావు, కే.ఎస్,ఆర్.దాస్ లాంటి హేమాహేమీల దగ్గర ఆయన అసిస్టెంట్‌గా పని చేసాడు. ఆ తర్వాత ‘కన్నెవయసు’, ‘లవ్ ఇన్ సింగపూర్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. లవ్ ఇన్ సింగపూర్ సినిమాలో చిరంజీవి హీరోగా నటించాడు. అంతేగాకుండా తెలుగులో దాదాపు 70 సినిమాలకు పైగానే నటించారు ఆంజనేయులు.


Next Story

Most Viewed