ఆ వృద్ధ దంపతులకు పురుగుల మందే తులసి తీర్థమాయేనా..!

109

దిశ, బాన్సువాడ: నేటి సమాజంలో బంధాలకు, బాంధవ్యాలకు విలువలేకుండా పోయింది. కంటికి రెప్పలా పెంచిన కన్న పిల్లలే కాటికి పోయేదానికి కారణమవుతున్నారు. కన్న పిల్లలకు తల్లిదండ్రులు భారం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై బిలోలికి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నస్రుల్లబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని బిలోలికి ప్రాంతానికి చెందిన గంగాధర్ గిరి(70), మహనంద(65) అనే వృద్ద దంపతులు తమను పోషించే వారు ఎవ్వరులేక మనస్తాపానికి గురై నస్రుల్లబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొచ్చేరి మైసమ్మ సమీపంలోని ప్రధాన కాలువపై క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..