బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే దోశ.. ఎక్కడో తెలుసా.?

by  |
బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే దోశ.. ఎక్కడో తెలుసా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైలే వేరు. ఆయన నటనతో ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు తిరుచ్చిలోని ఓ హోటల్‌ యజమాని కర్ణన్.. రజినీకాంత్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. అన్నాత్తె సినిమా(పెద్దన్న తెలుగులో) గురువారం దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా పెద్దన్న సినిమా సూపర్ హిట్ కావాలని హోట్‌ల్‌లో ఒక రూపాయికే దోశను అందిస్తున్నట్టు తెలిపారు. గురువారం తన హోటల్‌కు వచ్చే కస్టమర్లకు కర్ణన్ రూపాయికే దోశను అందిస్తున్నారు. ఇక, సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె సినిమా విడుదల సందర్భంగా.. చెన్నైలోని థియేటర్లకు అభిమానులు పోటెత్తారు. రజినీ సినిమాను తొలిరోజు మొదటి ఆటలోనే చూడాలనే ఉత్సాహంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ క్యూ కట్టారు.

కాబోయే భర్తే కదా.. నగ్న ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్.. చివరకు ఏమైందంటే.?

Next Story

Most Viewed