రేప్ చేసిన వ్యక్తి చెప్పాడని.. యూట్యూబ్‌లో చూసి అబార్షన్ చేసుకున్న యువతి.. ఆ తర్వాత!

by  |
రేప్ చేసిన వ్యక్తి చెప్పాడని.. యూట్యూబ్‌లో చూసి అబార్షన్ చేసుకున్న యువతి.. ఆ తర్వాత!
X

దిశ, వెబ్‌డెస్క్ : సమాజంలో నానాటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అందులో కొన్నిమాత్రమే వెలుగులోకి వస్తుంటే మరికొన్ని పేరెంట్స్ ఒత్తిడి, పరువు విషయమై ఆలోచించి సమాధి చేసేస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. ఓ వ్యక్తి యువతిని లైంగికంగా వేధిస్తూనే, పలుమార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఆమె గర్భం దాల్చడంతో ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకోసం యూట్యూబ్ చూడాలని చెప్పడంతో ఆమె వీడియోస్ చూస్తూ అబార్షన్ తానే చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని ఉత్తర నాగపూర్‌ యశోధర నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి రాగా, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకివెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల యువతిని సోహెల్ ఖాన్ అనే వ్యక్తి లైంగికంగా వేధించడమే కాకుండా, బలవంతంగా పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకోసం యూట్యూబ్‌లో వీడియోలు చూడాలని చెప్పడంతో అవి చూస్తూ ఎవరి సాయం లేకుండా ఆ యువతి తనంతట తానే అబార్షన్ చేసుకుంది. బొడ్డు తాడును కోసి గర్భస్రావం చేసిన అనంతరం పిండాన్ని సోహెల్ ఖాన్ ఎవరికి తెలియకుండా తాజ్‌నగర్ శ్మశాన వాటికలో ఖననం చేశాడు.

అయితే, యువతి కుటుంబసభ్యులకు అసలు విషయం తెలియగా వారు పోలీసులను ఆశ్రయించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలను తెలుసుకున్నారు. సోహెల్ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్టు తేల్చారు. వృత్తి రీత్యా డ్రైవర్ అయిన ఖాన్ ఆదాయం తగినంత లేదని బిడ్డ పుట్టాక మొదటి భార్యను వదిలేసినట్టు తెలిసింది. ఆ తర్వాత అతను కొన్నేళ్ల కిందట రెండవ వివాహం చేసుకోగా, ఒక కొడుకు కూడా జన్మించినట్టు తేల్చారు.

కాగా, 2016 నుంచి బాధిత యువతిని లైంగికంగా వేధిస్తూ, అత్యాచారం చేస్తూ వస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. అయితే, డీఎన్‌ఏ నమూనా కోసం ఖననం చేసిన పిండం అవశేషాలను వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నించగా లభ్యం కాలేదని వెల్లడించారు.



Next Story

Most Viewed