జాతీయ స్థాయి కవి సమ్మేళనానికి నామాల రవీంద్ర సూరి ఎంపిక

by  |

దిశ, సూర్యాపేట : జాతీయ స్థాయి కవి సమ్మేళనానికి నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన నామాల రవీంద్ర సూరి ఎంపికయ్యాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తేజ సాహితీ సేవా సంస్థ 15 సంవత్సరాల వేడుకల్లో భాగంగా మే 8, 9 తేదీల్లో జూమ్ మీటింగ్ ద్వారా కవితా పఠనం గావించడానికి ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభ సభకు ఆ సంస్థ వ్యవస్థాపకులు పోరెడ్డి రంగయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, రమణాచారి, సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని నామాల రవీంద్ర సూరి తెలిపారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed