కొత్త లుక్ లో గోపీచంద్.. అద్దిరిపోయిన ‘సీటీమార్’

by  |
sitimar
X

దిశ, సినిమా : కట్ అవుట్‌కు తగ్గ కథపడితే ఆ కథే వేరుంటది. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌ హీరో గోపీచంద్. యాక్షన్ ఫిల్మ్స్‌లో హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే మ్యాచో మ్యాన్.. కొంతకాలంగా సరైన సక్సెస్ లేక కెరీర్‌లో వెనుకబడ్డాడు. ఈ క్రమంలోనే తనకు ‘గౌతమ్ నంద’ వంటి ప్రామిసింగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న సినిమా ‘సీటీమార్’. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళల టీమ్‌కు కబడ్డీ కోచ్‌ పాత్రలో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న సినిమా ట్రైలర్‌ను తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లాంచ్ చేయడం విశేషం. ట్రైలర్ కంటెంట్ విషయానికొస్తే, ఒకే ఊరిలోని ఎనిమిది మంది అమ్మాయిలను కబడ్డీ టీమ్‌గా ఫామ్ చేసిన కోచ్ గోపీచంద్.. వారిని నేషనల్స్‌లో ఆడించేందుకు చేసే ప్రయత్నాలను, ఎదురయ్యే సవాళ్లను చూపించారు.

ఇదే క్రమంలో అమ్మాయిలను ఊరుదాటనివ్వని, షార్ట్ డ్రెస్సులు వేసుకోనివ్వని కట్టుబాట్లను ప్రశ్నిస్తూ.. ‘మన దేశంలో మగాళ్లు కనీసం 60 ఏళ్లు బతికి చనిపోతున్నారు. ఆడవాళ్లు కూడా అరవైయేళ్లు బతుకుతున్నారు. కానీ 20 ఏళ్లకే చనిపోతున్నారు, చంపేద్దామా వీళ్లందరినీ 20 ఏళ్లకే’ అని హీరో చెప్పే మాటలు కనువిప్పు కలిగిస్తాయి. ఇక తమన్నా గ్లామర్, మణిశర్మ సంగీతం ట్రైలర్‌ను కలర్‌ఫుల్‌గా నిలబెట్టగా.. గోపీచంద్ ఖాతాలో హిట్ పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఈ ట్రైలర్‌పై డైరెక్టర్ లింగుస్వామితో పాటు హీరో రామ్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.



Next Story

Most Viewed