క్లైమాక్స్‌లో ‘సీటీమార్’

by  |
క్లైమాక్స్‌లో ‘సీటీమార్’
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, బ్యూటిఫుల్ తమన్నా భాటియా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి గోపీచంద్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం చేవెళ్లలోని భారీ సెట్‌లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుండగా, షూటింగ్ స్పాట్‌లో కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మూవీ యూనిట్.. ఈ నెల 30తో షెడ్యూల్ పూర్తి కానుందని, ఒక్క పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుందన్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న సినిమాకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ కీలక పాత్ర పోషిస్తోంది. గోపీచంద్ ఏపీ మహిళల జట్టు కోచ్‌గా కనిపించనుండగా.. తమన్నా తెలంగాణ ఫిమేల్ కబడ్డీ కోచ్‌గా మెస్మరైజ్ చేయనుంది.



Next Story

Most Viewed