రేవంత్‌కు సీతక్క స్పెషల్ ట్రీట్.. ఏకంగా 100 కార్లతో..

by  |
రేవంత్‌కు సీతక్క స్పెషల్ ట్రీట్.. ఏకంగా 100 కార్లతో..
X

దిశ, ములుగు: తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెల‌పడానికి ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ జాతీయ మ‌హిళా కార్య‌ద‌ర్శి సీతక్క భారీ కాన్వాయ్‌తో హైద‌రాబాద్‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం బ‌య‌ల్దేరారు. 11 గంట‌ల స‌మ‌యంలో గట్టమ్మ ఆల‌యం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క.. అనంత‌రం దాదాపు 100 కార్ల‌తో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో క‌ల‌సి బ‌య‌ల్దేరారు. అంత‌కు ముందు ములుగులో అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూలామాల వేసి కార్ల ర్యాలీని ఆమె ప్రారంభించారు.

టీడీపీలోని 16 మంది కీల‌క నేత‌ల‌తో క‌ల‌సి రేవంత్‌రెడ్డి గత ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ లో చేరిన విష‌యం తెలిసిందే. రేవంత్‌రెడ్డితో క‌ల‌సి చేరిన కీల‌క టీడీపీ నేత‌ల్లో సీత‌క్క ఒక‌రు. ములుగు టికెట్‌ను రేవంత్‌రెడ్డి ప‌ట్టుబ‌ట్టి సీత‌క్క‌కు ఇప్పించిన విష‌యం తెలిసిందే. సీత‌క్క పార్టీ బ‌లోపేతానికి చేస్తున్న కృషిని రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలు కూడా స్వ‌యంగా ప్ర‌శంసించారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ద‌క్క‌డంతో పార్టీలో సీత‌క్క‌కు కూడా తిరుగులేద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, సర్పంచులు, సహకార సంఘాల ఛైర్మన్, వైస్ చైర్మన్ లు, యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా నాయకులు జిల్లా మండల ముఖ్య నాయకులు మాజీ ప్రజా ప్రతినిధిలు తదితరులు పాల్గొన్నారు




Next Story

Most Viewed