భైంసాలో 144 సెక్షన్.. ఏమైందంటే..?

by Aamani |   ( Updated:2021-10-25 03:28:37.0  )
Bimsa11
X

దిశ, ముధోల్: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ భైంసాలో సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిందితుల్ని తమకు అప్పజెప్పాలని, లేదా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు మహిళా కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నిరసన కారులను పోలీస్ వాహనాలలో స్టేషన్ కు తరలించారు.

అదేవిధంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ బైంసా మండలంలోని పలు గ్రామాలలో అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఇదిలా ఉంటే.. భైంసాలో ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ విగ్రహాన్ని పలువురు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భైంసా పట్టణంలో ఈనెల 26 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Advertisement

Next Story