పత్తి చేనులో కరోనా వ్యాక్సిన్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

by  |
Patthi-Chenu1
X

దిశ, కామేపల్లి: కోవిడ్ వ్యాక్సినేషన్ అమలులో జిల్లాలో కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల ద్వితీయ స్థానంలో నిలిచిందని వైద్యశాల వైద్యాధికారులు డాక్టర్ ఆర్. శ్రావణ్ కుమార్, డాక్టర్ వి. స్రవంతి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కామేపల్లి మండలంలో అర్హులైన 32 వేల 50 మందికి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును అందజేసిన్నట్లు వారు తెలిపారు. గ్రామాలలో సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటా వ్యాక్సినేషన్ ను చేపట్టినట్లు తెలిపారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో వాక్సినేషన్ అమలులో జిల్లాలో కామేపల్లి వైద్యశాల ద్వితీయ స్థానంలో నిలిచిందని వారు పేర్కొన్నారు. ప్రధానంగా కోవిడ్ -19 కట్టడి, లాక్ డౌన్ లో సైతం వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హారిక, హెచ్ఈవో బి.దూప్ సింగ్, హెల్త్ సూపర్ వైజర్లు ఎం. రాజు, జె. శ్రీనివాస్ రావు, బి. కళావతి, టి. భద్రమ్మ, బి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Next Story