భారత్‌లో రెండో కరోనా మరణం నమోదు

by Chukka Sudharani |   (  Updated:2020-03-13 19:48:24  IST  )

<p>భారత్‌లో రెండో కరోనా మరణం నమోదైంది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీత్ సుదాన్ వెల్లడించారు. మృతురాలి కుమారుడు ఇటీవల సిట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి భారత్‌కు తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో వారు ఈ నెల 7న రామ్ మనోహర్ [&hellip;]</p>

భారత్‌లో రెండో కరోనా మరణం నమోదు
X

భారత్‌లో రెండో కరోనా మరణం నమోదైంది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీత్ సుదాన్ వెల్లడించారు. మృతురాలి కుమారుడు ఇటీవల సిట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి భారత్‌కు తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో వారు ఈ నెల 7న రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. మహిళ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో శనివారం ఉదయం మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కర్నాటకు చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి కూడా కరోనాతో బుధవారం మరణించిన సంగతి తెలిసిందే.

tag; corona, second death, new delhi, ram manohar lohia hospital

Next Story