టిక్‌టాక్ పరిచయం.. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన కీచకుడు

by Vadlamudi Anukaran |

<p>దిశ, జడ్చర్ల : టిక్ టాక్ ద్వారా పరిచయమైన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన యువకుడిని చివరికి పోలీసులు పట్టుకొని, పోక్సో చట్టం ద్వారా కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం గౌరీ శంకర్ కాలనీకి చెందిన మైనర్ బాలిక(15) కనబడుట లేదని, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి అని ఈనెల 4వ తేదీన బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కిడ్నాప్ [&hellip;]</p>

టిక్‌టాక్ పరిచయం.. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన కీచకుడు
X

దిశ, జడ్చర్ల : టిక్ టాక్ ద్వారా పరిచయమైన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన యువకుడిని చివరికి పోలీసులు పట్టుకొని, పోక్సో చట్టం ద్వారా కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం గౌరీ శంకర్ కాలనీకి చెందిన మైనర్ బాలిక(15) కనబడుట లేదని, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి అని ఈనెల 4వ తేదీన బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కిడ్నాప్ కేసుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 10వ తేదీన అమ్మాయి స్వయంగా ఫోన్ చేయడంతో స్థానిక పోలీసులు అమ్మాయిని జడ్చర్లకు రప్పించి విచారించారు. దీంతో గత ఆరు నెలల క్రితం రాజాపూర్ కు చెందిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు మహేష్ సదరు బాలికకు టిక్ టాక్ ద్వారా పరిచయం అయ్యాడని తెలిపింది. అంతేకాకుండా తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తెలపింది.

దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు మహేశ్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల పట్టణ సీఐ వీరస్వామి తెలిపారు. అలాగే మహేష్ కు సహకరించిన తన మిత్రుడు పంచాయతీ సెక్రటరీ మహేష్ ను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఇలా ఇంకా ఎవరైనా అమ్మాయిలు మోసపోయి ఉన్నారా లేక ఇతరులు ఎవరైనా నిందితులుగా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు తమ పిల్లలు ఆన్‌లైన్ క్లాస్ ల పేరుతో దృష్టి మరలకుండా తల్లిదండ్రులు వారి పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పోలీసులు సూచిస్తున్నారు.

కాగా నిందితుడు మహేష్ ఇప్పటికీ కేవలం ఒక అమ్మాయి పట్లనే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారని తమ దర్యాప్తులో తేలిందని మరోవైపు అతని మొబైల్ కాల్ డేటా ఆధారంగా ఇంకేవైనా ఆధారాలు లభించినట్లయితే సుమోటోగా కేసు నమోదు చర్యలు తీసుకుంటామని సీఐ వీరస్వామి తెలిపారు. పోలీసుల వివరణ ఇలా ఉండగా.. జడ్చర్లలో కొంతమంది బృందాలుగా ఏర్పడి బాలికలు, యువతులకు వల వేస్తున్నట్లు, జడ్చర్ల తో పాటు వివిధ పట్టణాలు, గ్రామాలకు చెందిన యువతులు ఇప్పటికే చాలామంది వీరి వలలో చిక్కుకున్నట్లు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ దారుణాలలో పెద్ద తలకాయలు ఉండవచ్చని ఈ కోణంలో పోలీసులు లోతైన విచారణ చేపడితే మరింతమంది కీచకులు బయట పడే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కోణంలో విచారణ చేపట్టకుండా వారిని కాపాడేందుకు ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.

Next Story