- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సార్డీజీ స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
by Shyam |
<p>దిశ, భూపాలపల్లి: భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్సార్డీజి స్కూల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ డి సంజయ్ కుమార్ పాల్గన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి క్రిస్మస్ గొప్పతనాన్ని వివరించారు. అలాగే కరుణామయుడైన యేసు ప్రభువు లోక రక్షకుడు శాంతి మార్గాన్ని ప్రబోధించాడని తెలిపారు. మంచి మార్గంలో నడవడం కోసం మార్గం చూపిన వాడిగా ఏసుక్రీస్తును కొనియాడారు. పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా యేసు పుట్టిన రోజును […]</p>

X
దిశ, భూపాలపల్లి: భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్సార్డీజి స్కూల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ డి సంజయ్ కుమార్ పాల్గన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి క్రిస్మస్ గొప్పతనాన్ని వివరించారు. అలాగే కరుణామయుడైన యేసు ప్రభువు లోక రక్షకుడు శాంతి మార్గాన్ని ప్రబోధించాడని తెలిపారు.
మంచి మార్గంలో నడవడం కోసం మార్గం చూపిన వాడిగా ఏసుక్రీస్తును కొనియాడారు. పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా యేసు పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్ ,రవి, చైతన్య, సౌమ్య, సుమన్ వేణు, క్రాంతి కుమార్, మధు ,శ్రీవాణి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






