- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ : మొగలాయి పాలకుల ఆధిపత్యంపై తిరుగుబాటు చేసిన తెలంగాణ శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలు బుధవారం నగరంలో ఘనంగా జరిగాయి. పలు కుల సంఘాలు, రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో నగర శివారులోని మానేరు వంతెనపై ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీజేపీ […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : మొగలాయి పాలకుల ఆధిపత్యంపై తిరుగుబాటు చేసిన తెలంగాణ శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలు బుధవారం నగరంలో ఘనంగా జరిగాయి. పలు కుల సంఘాలు, రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో నగర శివారులోని మానేరు వంతెనపై ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, కుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






