సమస్యల వలయంలో సర్పంచ్‌లు.. ప్రభుత్వం పట్టించుకునేనా ?

by  |
సమస్యల వలయంలో సర్పంచ్‌లు.. ప్రభుత్వం పట్టించుకునేనా ?
X

దిశ,శాయంపేట : గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి గ్రామ ప్రథమ పౌరుడు ముందు వరుసలో ఉంటాడు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో గ్రామీణ అభివృద్ధికి తోడ్పడతాడు. శాయంపేట మండలంలోని 24 గ్రామ పంచాయితీ సర్పంచుల సమస్య గురించి రాసి రామాయణం అంతా చెబితే మహాభారతం అంత ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గ్రామంలో సర్పంచులు లక్షల కొద్ది రూపాయలు ఖర్చుపెట్టి గెలుపొంది కొలువుదీరాక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే వారి కష్టాల గురించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ఎన్నో నిధులు ఇస్తున్నామని వైకుంఠధామం, నర్సరీ, హరితహారం, ఇంటింటికి చెత్తబుట్టలు, రైతు వేదికలు, విలేజ్ డంపింగ్ యార్డ్, పలు రకాలుగా ప్రాజెక్టులు చేపట్టి సర్పంచ్‌ల చేత చేయిస్తోంది.

లక్షల కొద్ది రూపాయలు అప్పుగా తెచ్చి ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తున్నా బిల్లుల రాక ఇబ్బంది పడాల్సి వస్తుందని కొందరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాక చెప్పిన పని చేయకపోతే ప్రభుత్వం నుండి షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దీనికి తోడు ప్రభుత్వ అధికారులు నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి లేకపోవడం. కనీసం గ్రామంలో కుళాయిలు బిగించడానికి , వీధి దీపాలు పెట్టించడానికి మోరీల నుంచి బురద తీయించడానికి కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి ఒక్కపైసా లేక ప్రభుత్వం నుంచి రాక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల నుండి వేధింపులను భరించలేక అధిక వడ్డీకి అప్పులు తెచ్చి తలకు మించిన భారాన్ని మోస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా దరిద్రమైన విషయం ఏమిటంటే ప్రతి నెలా సర్పంచులకు చెల్లించే ఐదు వేల రూపాయల గౌరవ వేతనం రాక పోవడం ప్రభుత్వ పాలను అద్దంపడుతోంది.

బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది

శాయంపేట మండలం వసంతపూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర అనూష భర్త ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. సర్పంచ్‌గా గెలిచి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది, గవర్నమెంట్ ఆదేశం ప్రకారం ఏ పని అప్పజెప్పినా కచ్చితంగా బాధ్యతతో పని చేస్తున్నాము. కానీ, బిల్లుల విషయంలో బిల్లులు పాస్ కావడం లేదు గ్రామపంచాయతీ అకౌంట్‌లో మాత్రం లక్షలు లక్షలు ఉన్నట్లుగా చూపిస్తుంది కానీ, తీరా చెక్కులు వేస్తే పాస్ కావడం లేదని తెలిపారు. అలాగే గవర్నమెంట్‌కు రావాల్సినవి మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్ రెండు మూడు రోజులలో పడుతుంది కానీ, ఇప్పటి చెక్ తీసుకొని రెండు నెలల మీద 7 రోజులు పడుతుంది ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు అప్పులు తెచ్చి మిత్తి కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే సర్పంచ్ కానీ తీరా చూస్తే అప్పుల మనిషి లాగా కనబడుతుంది. కావున సకాలంలో బిల్లులు వచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నామన్నారు.


Next Story