మనీష్ మల్హోత్రాను మమ్మీతో పోల్చిన హీరోయిన్

by  |
Sara Ali Khan, Manish Malhotra
X

దిశ, సినిమా: యూనిక్ ఫ్యాషన్స్‌తో బాలీవుడ్ స్టార్స్‌‌‌ను కొత్తగా ప్రజెంట్ చేసే ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా.. వారి ఆన్‌స్క్రీన్ అప్పియరెన్స్‌‌ ఆకట్టుకునేలా డిజైన్స్ రూపొందిస్తుంటాడు. ఈ క్రమంలో దాదాపు బీటౌన్ హీరోయిన్స్ అందరితోనూ క్లోజ్‌గా మూవ్ అయ్యే మనీష్.. అప్పుడప్పుడూ వారిని లంచ్, డిన్నర్స్‌కు ఆహ్వానించి సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. ఈ మధ్యే కపూర్ సిస్టర్స్ జాన్వీ, ఖుషీని డిన్నర్‌కు పిలిచిన ఫ్యాషన్ డిజైనర్.. తాజాగా సారా అలీ ఖాన్‌తో పాటు ఆమె తల్లి, ప్రముఖ నటి అమృతా సింగ్‌కు వెల్‌కమ్ చెప్పి, డిలీషియస్ డిన్నర్ ప్లాన్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత మనీష్‌కు ఇన్‌స్ట్రామ్‌లో కృతజ్ఞతలు తెలిపిన సారా.. టేస్టీ ఐటమ్స్‌తో కూడిన ప్లేట్‌ను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో వారితో పాటు ఫేమస్ స్టైలిస్ట్ అమీ పటేల్ కూడా ఉన్నారు.

కాగా, ఇంటికి పిలిచి రుచికరమైన భోజనం అందించిన మనీష్‌కు ఈ పోస్టు ద్వారా థాంక్స్ చెప్పిన సారా.. అతన్ని మమ్మీతో పోల్చింది. ఇక కెరీర్‌పరంగా చూస్తే.. వరుణ్ ధావన్‌తో కలిసి ‘కూలీ నం.1’ చిత్రంలో కనిపించిన సారా.. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో నటించిన ‘అత్రంగి రే’ సినిమా కోసం ఎదురుచూస్తోంది.


Next Story

Most Viewed