కిలాడికి కలర్ ఫుల్ వెల్‌కమ్

by  |
కిలాడికి కలర్ ఫుల్ వెల్‌కమ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్‌కు అదిరిపోయే వెల్‌కమ్ చెప్పింది యంగ్ బ్యూటీ సారా అలీఖాన్. ‘అత్రంగి రే’ ద్వారా అక్షయ్, ధనుష్‌తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సారా..ఇన్నాళ్లు ధనుష్‌తో షూటింగ్ ఎంజాయ్ చేయగా..ప్రస్తుతం అక్షయ్‌తో ఫిల్మింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపింది. శుక్రవారం నుంచి కిలాడి అక్షయ్ ‘అత్రంగి రే’ టీమ్‌తో జాయిన్ కాబోతుంది. తన రాకతో ‘అత్రంగి రే’ మరింత కలర్ ఫుల్‌గా మారబోతుందంటూ ఇద్దరి పిక్‌ను షేర్ చేసింది. అక్కితో కలిసి పనిచేయడాన్ని విశేషంగా భావిస్తున్నానన్న సారా.. ధన్యవాదాలు తెలిపింది.

మరోవైపు అక్షయ్ .. లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మ్యాజిక్ వర్డ్స్ చాలా ఆనందాన్నిస్తాయని..శుక్రవారం నుంచి ‘అత్రంగి రే’ షూటింగ్ ప్రారంభించబోతున్నాను అని ట్వీట్ చేశాడు. అభిమానుల నుంచి లవ్, బెస్ట్ విషెస్ కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ సంగీతం సమకూరుస్తుండగా..హిమాన్షు శర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. టి సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

https://twitter.com/akshaykumar/status/1334740442424823813?s=20


Next Story