- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైఫ్ కూతురి షాకింగ్ మేకోవర్
<p>బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బీటౌన్‌లో అడుగుపెట్టిన సారా అలీ ఖాన్.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తన అందం, అభినయంతో యువ హృదయాలను కొల్లగొడుతున్న సారా.. తను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమాల్లోకి రాకముందు 96 కిలోల బరువున్న సారా.. స్లిమ్‌గా మారేందుకు పట్టుదలతో శ్రమించిందంట. ఓ స్టార్ హీరో కూతురై ఉండి కూడా తను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడిందట. ఈ నేపథ్యంలోనే […]</p>

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బీటౌన్‌లో అడుగుపెట్టిన సారా అలీ ఖాన్.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తన అందం, అభినయంతో యువ హృదయాలను కొల్లగొడుతున్న సారా.. తను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమాల్లోకి రాకముందు 96 కిలోల బరువున్న సారా.. స్లిమ్‌గా మారేందుకు పట్టుదలతో శ్రమించిందంట. ఓ స్టార్ హీరో కూతురై ఉండి కూడా తను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడిందట. ఈ నేపథ్యంలోనే ‘సారా కా సారా టూ సారా కా ఆదా’ అంటూ.. తన ఫ్యాట్ టూ ఫిట్ జర్నీని తన అభిమానులకు తెలుపుతూ ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె అధిక బరువుతో ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలతో పాటు స్లిమ్‌గా మారేందుకు చేసిన ఎక్సర్‌సైజులు, స్విమ్మింగ్, బైక్ రైడింగ్ తదితర వర్కవుట్లకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోలో సారాపడ్డ కష్టానికి ఫిదా అయిన నెటిజన్లు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కేదార్‌నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా.. తొలి సినిమాలోనే మంచి నటన కనబర్చింది. ఆ సినిమాలోని నటనకు గానూ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత సింబా, లవ్ ఆజ్‌కల్ సినిమాల్లో కనిపించిన ఈ ఖాన్ కూతురు.. ప్రస్తుతం కూలీ నెం.1 సినిమాలో నటిస్తోంది.






