తమ పెళ్లికి రమ్మంటున్న సన్య మల్హొత్ర

by  |
తమ పెళ్లికి రమ్మంటున్న సన్య మల్హొత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దంగల్’ ఫేం సన్యా మల్హోత్రా ‘లూడో’ సినిమాతో డిజిటల్ డెబ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో సన్య ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో మరో నెట్‌ఫ్లిక్స్ సినిమాతో సన్య అలరించనుంది. రొమాంటిక్ కామెడీగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను, హీరో, హీరోయిన్స్ ఫస్ట్ లుక్‌ను నిర్మాత కరణ్ జోహర్ తాజాగా విడుదల చేశాడు. సన్య మల్హోత్ర, అభిమన్యు దసాని కలయికలో వస్తున్న చిత్రానికి ‘మీనాక్షి సుందరేశ్వర్’ అనే పేరును ఖరారు చేశారు. సౌత్ ఇండియాకు చెందిన కపుల్స్‌గా వీరిద్దరూ ప్రేక్షకులను అలరించనున్నారు. వివేక్ సోని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

‘మీనాక్షి, సుందరేశ్వర్‌ల పెళ్లికి మీ అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బహుమతులు పంపించడంతోపాటు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ టిప్స్ కూడా షేర్ చేయండి’ అని సన్య రాసుకొచ్చింది. ‘వాట్స్ ఏ నేమ్? మ్యారేజ్, లవ్, లాఫర్, టియర్స్. మీనాక్షి సుందరేశ్వర్ మీకోసం రెడీగా ఉన్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్నాం’ అని కరణ్ ట్వీట్ చేశాడు. మీనాక్షిసుందరేశ్వర్‌లో సన్య పెళ్లి కూతురు గెటప్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండగా, అభిమన్యు పెళ్లి కొడుకుగా కనిపిస్తున్నాడు. మరి మీనాక్షి, సుందర్‌ తమ పెళ్లి కబుర్లు, జంట ముచ్చట్లను చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed