ఆ భూములతో వందేళ్ల బంధమున్నా.. పట్టాలు, రైతుబంధు రావట్లే..!

by  |
ఆ భూములతో వందేళ్ల బంధమున్నా.. పట్టాలు, రైతుబంధు రావట్లే..!
X

దిశ, ఆసిఫాబాద్ రూరల్ : గత వందేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, రైతుబంధు ఇప్పించాలని కోరుతూ మండలంలోని చోర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సంకేపళ్లి దళిత రైతులు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాత ముత్తాతల కాలం నుంచి సంకేపల్లి శివారులో 25 దళిత కుటుంబాలు భూములు సాగు చేసుకుంటున్నాయన్నారు.

కానీ, ఇప్పటివరకు ఆ భూములకు ఏ విధమైన ఆధారాలు, పట్టాలు లేవని.. దీంతో ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. అందువలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలతో పాటు రైతు బంధు సాయం ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రఫతుల్లాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు బుచ్చయ్య, బిక్కు, శివరాం, దాదాజీ, ఉమాకాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed