కేజీఎఎఫ్‌కు “అధీర” రీఎంట్రీ..

23

దిశ, వెబ్ డెస్క్ : అధీర కమింగ్ బ్యాక్.. ట్రూ వారియర్ సంజయ్ దత్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ షురూ చేశాడు. క్యాన్సర్‌తో బాధపడుతూ ఇన్నాళ్లు షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సంజూ భాయ్.. షార్ట్ బ్రేక్ తర్వాత పని మొదలెట్టాడు. బ్లాక్ టీ షర్ట్, ట్రౌజర్స్, బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంజూ.. కేజీఎఫ్ షూటింగ్‌లో పాల్గొనేందుకు అంతా సెట్ అని చెప్పాడు. ఇప్పటికే రిలీజైన అధీర లుక్‌లో రాక్షసత్వానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉన్న తను.. మెయిన్ విలన్‌గా రాఖీ భాయ్‌కు గట్టి సవాల్ విసురుతాడని తెలిపింది మూవీ యూనిట్.

ఇక తాజాగా హెయిర్ స్టైల్ చేయించుకున్న సంజూ భాయ్.. గతంలో షూటింగ్ టైమ్ లో జరిగిన గాయాలను చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాదు ‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది.. సంజూ భాయ్‌కు క్యాన్సర్ అనే వార్తలు రాయొద్దు’ అని మీడియాతో ఫన్నీగా చెప్పే వీడియో కూడా ఆకట్టుకుంది.

కాగా కేజీఎఫ్ చాప్టర్ 2 చివరి షెడ్యూల్‌లో ఇప్పటికే హీరో యశ్ జాయిన్ కాగా.. అధీర, రాఖీ భాయ్ మధ్య క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరించనున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రం విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది మూవీ యూనిట్.