- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB బిగ్ అనౌన్స్‌మెంట్.. కొత్త కోచ్ అతనే అంటూ అధికారిక ప్రకటన..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో కోహ్లీ అనగానే గుర్తుకు వచ్చే టీం ఆర్‌సీబీ(royal challengers Bangalore). అయితే 2021 ఐపీఎల్ తర్వాత తాను ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు మరింత ఆవేదనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జట్టును మరింత బలంగా తయారు చేసేందుకు సిద్ధమైంది జట్టు యాజమాన్యం. దీంతో వచ్చే సీజన్‌కు ముందు మెగావేలం జరగనున్న క్రమంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో కోహ్లీ అనగానే గుర్తుకు వచ్చే టీం ఆర్‌సీబీ(royal challengers Bangalore). అయితే 2021 ఐపీఎల్ తర్వాత తాను ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు మరింత ఆవేదనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జట్టును మరింత బలంగా తయారు చేసేందుకు సిద్ధమైంది జట్టు యాజమాన్యం. దీంతో వచ్చే సీజన్‌కు ముందు మెగావేలం జరగనున్న క్రమంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్సంజయ్ బంగర్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని మంగళవారం టీం యాజమాన్యం అధికారికంగా ప్రకటించారు. బంగర్.. ఆర్‌సీబీకి వచ్చే రెండు సీజన్లకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మైక్ హెసన్ జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. ఇక, ఐపీఎల్-2022 వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. అంతకుముందు జనవరిలో మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో పాల్గొననున్నాయి.
🔊 ANNOUNCEMENT 🔊
Sanjay Bangar, former interim head coach of #TeamIndia and batting consultant for RCB, is all set to #PlayBold as the new head coach of RCB for the next two years.
Congratulations, Coach Sanjay! We wish you all the success.#WeAreChallengers #IPL2022 pic.twitter.com/AoYaKIrp5T
— Royal Challengers Bangalore (@RCBTweets) November 9, 2021






