ఆదిత్య రాయ్ కపూర్‌తో సంజన రొమాన్స్?

by  |
ఆదిత్య రాయ్ కపూర్‌తో సంజన రొమాన్స్?
X

దిశ, వెబ్ డెస్క్ : ‘సడక్ 2’ సినిమాతో డిజాస్టర్ చవిచూసిన లవర్ బాయ్ ఆదిత్య రాయ్ కపూర్.. ‘ఏక్ విలన్ 2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అహ్మద్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓమ్ సినిమాను ఫైనల్ చేసిన ఆదిత్య.. ఈ సినిమాలో పవర్ ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్ కోసం పర్టికులర్ బాడీ గెయిన్ చేసే పనిలో ఉన్నాడు. కాగా ఈ సినిమాలో ఆదికి బెస్ట్ జోడీ ఎవరనే దానిపై చర్చ జరిగింది. దిశా పటానీ, తారా సుతారియ పేర్లు తెరమీదకి వచ్చినా.. ఫైనల్‌గా ఆదితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దిల్ బెచారా హీరోయిన్ సంజనా సంఘీకే దక్కింది.

సినిమాలో ఫ్రెష్ పెయిర్ ఉండాలని ఆశించిన అహ్మద్ ఖాన్ ఇందుకోసం సంజననే బెస్ట్ చాయిస్ అనుకున్నాడని టాక్. ఓమ్ సినిమాలో సంజన.. ఆదిత్య లవర్‌గా అందంగా కనిపించడంతో పాటు పలు యాక్షన్ న్స్‌లోనూ నటించనుందని సమాచారం. అహ్మద్ ఖాన్ ట్రేడ్ మార్క్‌కు తగినట్లుగా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రాబోతున్న ఓమ్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మలంగ్ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్ పర్ఫార్మెన్స్‌కు ఇంప్రెస్ అయిన అహ్మద్ ఖాన్ ఆదిని సెలెక్ట్ చేసుకోగా.. దిల్ బెచారా సినిమాలో సంజన ఇన్నోసెన్స్‌కు పడిపోయాడట. దీంతో ఈ ఇద్దరినే ఫైనల్ చేశాడని సమాచారం.


Next Story

Most Viewed