యాక్షన్ థ్రిల్లర్‌లో దిల్ బెచారా హీరోయిన్.!

by  |
యాక్షన్ థ్రిల్లర్‌లో దిల్ బెచారా హీరోయిన్.!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దిల్ బెచారా’ హీరోయిన్ సంజనా సంఘీ గ్రేట్ చాన్స్ కొట్టేసింది. సెకండ్ మూవీకే యాక్షన్ థ్రిల్లర్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. క్లాస్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ‘ఓమ్ : ది బ్యాటిల్ వితిన్ సినిమా’ ద్వారా ఫస్ట్ టైమ్ యాక్షన్ పవర్ చూపించబోతుండగా.. తనతో కలిసి యాక్షన్ సీక్వెన్స్‌లు చేయబోతుంది సంజన. పవర్‌ఫుల్, బ్రేవ్, కాన్ఫిడెంట్, షార్ప్ గర్ల్ కావ్య పాత్రలో నటించబోతున్న తనను ప్రాజెక్ట్‌లోకి వెల్‌కమ్ చెప్తూ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది మూవీ యూనిట్.

‘ఓమ్ : ది బ్యాటిల్ వితిన్ సినిమా’ ద్వారా కపిల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండగా.. జీ స్టూడియోస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత అహ్మద్ ఖాన్.. దిల్ బెచారాలో కిజీ పాత్రకు వంద శాతం న్యాయం చేస్తూ సినిమాను బాధ్యతగా భావించిన సంజనను చూశాక.. అదే రెస్పాన్సిబిలిటీ ఈ సినిమాకు కూడా అవసరమని తనను ఎంచుకున్నట్లు చెప్పాడు. ఇండియాలోని మూడు రాష్ట్రాల్లో డిసెంబర్ నుంచి మూవీ షూటింగ్ జరగబోతుండగా.. మార్చిలో ఎండ్ అవుతుందని తెలిపారు. 2021 సెకండ్ హాఫ్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. యాక్షన్ హీరోగా ఆది బెస్ట్ చూపిస్తారని.. కపిల్ వర్మ ఇందుకోసం హండ్రెడ్ పర్సంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడని తెలిపారు.

కాగా ఈ సినిమాలో నటించేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపిన సంజన.. ఆదితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం బెస్ట్ పార్ట్ అని చెప్పింది.


Next Story

Most Viewed