- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్సలు ఊహించలేదు : సంజన
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘దిల్ బెచారా’ హీరోయిన్ సంజనా సంఘీ కలలో కూడా ఊహించనిది జరిగిందని చెప్తోంది. తను అసలు ఎప్పటికీ ఊహించలేనిది… ఊహించని విధంగా చూశానని సంబరపడుతోంది. ఇంతకీ ఏం చూసిందనేగా క్వశ్చన్. ఇండియన్ సినిమా సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం చూసిన సంజన.. ఆ కార్యక్రమంలో తన గురించి ప్రశ్న అడగటం చూసి గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ‘దిల్ బెచారా’ హీరోయిన్ సంజనా సంఘీ కలలో కూడా ఊహించనిది జరిగిందని చెప్తోంది. తను అసలు ఎప్పటికీ ఊహించలేనిది… ఊహించని విధంగా చూశానని సంబరపడుతోంది. ఇంతకీ ఏం చూసిందనేగా క్వశ్చన్. ఇండియన్ సినిమా సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం చూసిన సంజన.. ఆ కార్యక్రమంలో తన గురించి ప్రశ్న అడగటం చూసి గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
చైల్డ్‌హుడ్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు కుటుంబంతో కలిసి బచ్చన్ జీ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్ చూసే దాన్నని చెప్పిన సంజన.. ఆ కార్యక్రమంలో ప్రశ్నలు అడుగుతుంటే హాట్ సీట్‌లో కూర్చున్నట్లు ఊహించుకుని సమాధానాలు చెప్పేదాన్నని తెలిపింది. కానీ ఇప్పుడు అనుకోని విధంగా తన గురించే అమితాబ్ జీ కంటెస్టెంట్‌ను ప్రశ్న అడగడం అస్సలు ఊహించలేదని చెప్పింది. ఇంతకీ షోలో సంజన గురించి ఏం క్వశ్చన్ అడిగారంటే.. ‘దిల్ బెచారా’ టైటిల్ సాంగ్ ప్లే చేసి.. ఈ సాంగ్‌లో కనిపించిన హీరోయిన్ ఎవరు అని? దీనికి కంటెస్టెంట్ కూడా సరైన సమాధానం చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయింది సంజన. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా అయిన ‘దిల్ బెచారా’ ట్రైలర్, సినిమా, సాంగ్స్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CGJ48zLFXsc/?utm_source=ig_web_button_share_sheet






