‘సుశాంత్‌తో ఫస్ట్ మీటింగ్‌లోనే తెలిసిపోయింది’

by  |
‘సుశాంత్‌తో ఫస్ట్ మీటింగ్‌లోనే తెలిసిపోయింది’
X

దిశ, సినిమా : హీరోయిన్ సంజన సంఘీ.. తన డెబ్యూ మూవీ హీరో లేట్ సుశాంత్ సింగ్‌తో ఫస్ట్ మీటింగ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. వారిద్దరి మధ్య కామన్ పాయింట్స్ ఉండటంవల్లే చాలా తొందరగా కలిసిపోయామని చెప్పింది. సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బెచారా’లో నటించిన సంజన.. తనతో కలిసి మూవీ ప్రమోషన్స్‌ కోసం ప్లాన్ చేసుకున్న విషయాలను గుర్తుచేస్తూ.. మొదటిసారి డైరెక్టర్ ముఖేష్ ఆఫీస్‌లో సుశాంత్‌ను కలిశానని, ఐదు నిమిషాల్లోనే ఇద్దరికీ అకడమిక్ విషయాలపై ఆసక్తి ఉంటుందనే విషయం అర్థమైందని వివరించింది. అంతేకాదు ఢిల్లీ అంటే ఇష్టమని, అక్కడి ఫుడ్ కోసం ఇద్దరం పడిచస్తామని తెలిపింది.

ఇక ఒంట్లో శక్తిని సేవ్ చేస్తుండాలని సుశాంత్ ఎప్పుడూ చెప్తుండేవాడన్న సంజన.. వైడ్ యాంగిల్ షాట్స్‌లో అవసరం మేరకే నటించాలని సూచించినట్లు తెలిపింది. దీన్ని ‘ఎనర్జీ రేషనింగ్’ అని పిలుస్తుండేవాడని పేర్కొంది. కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే సుశాంత్ సూసైడ్ చేసుకోగా.. ఆ తర్వాత సంజన ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ ఫెల్ట్ నోట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంజన కపిల్ వర్మ డైరెక్షన్‌లో ఆదిత్య రాయ్ కపూర్‌తో నటిస్తోంది.

Next Story

Most Viewed