- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా స్వేరో విక్టరీ డే
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: ప్రపంచంలోనే అతిచిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని మలావత్ పూర్ణ స్వేరో, ఆనంద్ కుమార్ స్వేరో 2014 మే 25న అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మే 25న స్వేరోలు విక్టరీ డేగా జరుపుకుంటారు. ఈ క్రమంలో సోమవారం విక్టరీ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఇప్ప రవి, అవునూరి సుధాకర్, రేగుంట లక్ష్మయ్యలను సన్మానించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా […]</p>

X
దిశ, ఆదిలాబాద్: ప్రపంచంలోనే అతిచిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని మలావత్ పూర్ణ స్వేరో, ఆనంద్ కుమార్ స్వేరో 2014 మే 25న అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మే 25న స్వేరోలు విక్టరీ డేగా జరుపుకుంటారు. ఈ క్రమంలో సోమవారం విక్టరీ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఇప్ప రవి, అవునూరి సుధాకర్, రేగుంట లక్ష్మయ్యలను సన్మానించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్వేరోలు అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మే 25న వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన కార్మికులను, అధికారులను సన్మానిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, స్వేరో సర్కిల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కర్రె రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు అటకాపురం రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
Next Story






