- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూట్ లుక్‌లో సంఘవి కూతురు..
<p>దిశ, వెబ్ డెస్క్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి సంఘవి. ఆ తర్వాత అప్పటి అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసింది. సీతారామరాజు, సూర్యవంశం, సమరసింహా రెడ్డి, ప్రేయసిరావే, సందడే సందడి ఇలా వరసగా సినిమాలు చేస్తూ.. మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు 45కు పైగా సినిమాలు చేసిన సంఘవి.. చివరగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘ఆంధ్రావాలా’ సినిమాలో నటించింది. 15 ఏళ్ల ఆమె సినీ కెరీర్‌లో తెలుగు, […]</p>

దిశ, వెబ్ డెస్క్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి సంఘవి. ఆ తర్వాత అప్పటి అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసింది. సీతారామరాజు, సూర్యవంశం, సమరసింహా రెడ్డి, ప్రేయసిరావే, సందడే సందడి ఇలా వరసగా సినిమాలు చేస్తూ.. మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు 45కు పైగా సినిమాలు చేసిన సంఘవి.. చివరగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘ఆంధ్రావాలా’ సినిమాలో నటించింది. 15 ఏళ్ల ఆమె సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ భాషల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో.. జబర్దస్త్‌లో కొన్ని ఎపిసోడ్లకు సంఘవి జడ్జ్‌గా వ్యవహరించింది. అయితే ఆమె ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా సంఘవి.. తన కూతురితో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.






