‘నరకాసురుడు’గా వస్తున్న సందీప్ కిషన్…

by  |
‘నరకాసురుడు’గా వస్తున్న సందీప్ కిషన్…
X

దిశ, వెబ్ డెస్క్ : సందీప్ కిషన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరో. అయితే ఈ మధ్య సందీప్ చేస్తున్న సినిమాలేవి తనకు అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈ మధ్య వచ్చిన ఎ1 ఎక్స్‌ప్రెస్ సైతం బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. అయితే తమిళ యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మూడేళ్ల క్రితం సందీప్ కిషన్, అరవింద స్వామి, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను గౌతమ్ మీనన్ నిర్మించారు. అయితే అప్పుడున్న ఆర్థిక ఇబ్బందులతో నిర్మాత గౌతమ్ మీనన్ అ సినిమా విడుదల చేయలేకపోయారు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కొలిక్కి రావడంతో ఈ సినిమాను ‘సోని లైవ్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు ‘నరకాసురుడు’ అన్న పేరుతో రానుంది. మరి ఈ సినిమానైనా సందీప్ కు విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.


Next Story

Most Viewed