వ‌రంగ‌ల్ రోడ్ల‌పై..ఇసుకోయమ్మ ఇసుక‌

by Shyam |   (  Updated:2025-08-01 18:12:50  IST  )

<p>దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ రోడ్ల‌పై ఇసుక సంత జ‌రుగుతోంది. ఉన్న‌తాధికారులు, జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులంతా నివాస‌ముండే హ‌న్మ‌కొండలోని టీచ‌ర్స్ కాల‌నీ ఫేజ్‌-1, ఫేజ్‌-2 కాల‌నీల‌కు అర్ధ‌రాత్రి నుంచి ట్రాక్ట‌ర్లు వంద‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నాయి. ఇంత య‌థేచ్ఛ‌గా… బ‌రితెగింపుగా..ఇసుక మాఫియా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారులు ప‌ట్టించుకున్న పాప‌న పోవ‌డం లేదు. జంకు, బొంకు లేకుండా య‌థేచ్ఛ‌గానే దందా సాగిస్తున్నారు. హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ న‌గ‌రాల‌కు స‌మీపంలో ఉన్న వాగులు, వంక‌ల్లోని ఇసుక‌ను లూటీ […]</p>

వ‌రంగ‌ల్ రోడ్ల‌పై..ఇసుకోయమ్మ ఇసుక‌
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ రోడ్ల‌పై ఇసుక సంత జ‌రుగుతోంది. ఉన్న‌తాధికారులు, జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులంతా నివాస‌ముండే హ‌న్మ‌కొండలోని టీచ‌ర్స్ కాల‌నీ ఫేజ్‌-1, ఫేజ్‌-2 కాల‌నీల‌కు అర్ధ‌రాత్రి నుంచి ట్రాక్ట‌ర్లు వంద‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నాయి. ఇంత య‌థేచ్ఛ‌గా… బ‌రితెగింపుగా..ఇసుక మాఫియా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారులు ప‌ట్టించుకున్న పాప‌న పోవ‌డం లేదు. జంకు, బొంకు లేకుండా య‌థేచ్ఛ‌గానే దందా సాగిస్తున్నారు. హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ న‌గ‌రాల‌కు స‌మీపంలో ఉన్న వాగులు, వంక‌ల్లోని ఇసుక‌ను లూటీ చేస్తున్న ఇసుక మాఫియాగాళ్లు అర్ధ‌రాత్రి మొద‌లు..‌తెల్లవారుతుండ‌గానే ప‌ట్ట‌ణంలోకి చేరుకుంటున్నారు.ఒక్కో ట్రాక్ట‌ర్ ట్రిప్పుకు రూ.5000 నుంచి 6000 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటుపడి ఇసుక దందాను చూసీచూడనట్లుగా‌ వదిలేస్తున్నారు. దీంతో ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత వ‌రంగ‌ల్ న‌గ‌రం శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. బహుళ‌ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, ఆస్ప‌త్రులు, పారిశ్రామిక‌, సేవ రంగాల‌కు చెందిన సంస్థ‌లు వెలుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇది ఇసుక మాఫియాకు వ‌రంగా మారింది.

వాగుల‌ను తోడేస్తున్న మాఫియా..

వరంగల్‌, హ‌న్మ‌కొండ, కాజీపేట‌తో పాటు హ‌స‌న్‌ప‌ర్తి ప్రాంతాల‌కు గోదావరి, మానేరు , చలివాగుతోపాటు నగరానికి చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. గోదావరి, మానేరు ఇసుక పేరిట జోరుగా దందా నడుస్తోంది. ప్రధాన రోడ్లు, నిర్మాణాలు జ‌రిగే ప్రాంతాలే అడ్డాలుగా మారుతున్నాయి. క‌రీంన‌గ‌ర్ రూట్‌లోని హసన్‌పర్తి నుంచి కేయూ మీదుగా వడ్డెపల్లి వరకు ట్రాక్ట‌ర్ల క్యూ క‌నిపిస్తోంది. ప‌ట్ట‌ణ శివారు ప్రాంతాలైన హసన్‌పర్తి, ములుగు రోడ్డు పెద్దమ్మ గడ్డ, వడ్డెపల్లి క్రాస్ వరకు కేయూసీ రోడ్డు, హంటర్ రోడ్డు, మడికొండ, మామూనూర్ ఇలా చాలా ప్రాంతాల్లో ఇసుక డంప్‌ల‌ను ఏర్పాటు చేసుకున్న మాఫియా.. ముందే ఆర్డ‌ర్లు తీసుకుని గ‌మ్యాల‌కు త‌ర‌లిస్తున్నాయి.

దాంతోపాటు రోడ్ల‌పై పెట్టి బేరాల‌తో కూడా విక్ర‌యిస్తోంది. ట‌న్నులు మ‌రియు ట్రిప్పుల‌ లెక్క‌న అమ్మేస్తోంది. ట‌న్నుకయితే రూ.1,600 నుంచి రూ. 2,000 ధర నిర్ణయించి విక్రయిస్తుండ‌గా, ట్రిప్పుకైతే రూ.5000ల‌నుంచి 6000 వ‌ర‌కు విక్ర‌యిస్తోంది.ఇసుక అక్రమ రవాణాపై చర్యలు చేపట్టాల్సి పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు క‌నీసం అటు ప‌క్క కూడా చూడ‌టం లేదు. ఇసుక మాఫియాపై చ‌ర్య‌ల్లేక‌పోవ‌డంతో నిత్యం న‌గ‌రంలోకి వేలాది ట్రాక‌ర్ల‌ను త‌ర‌లించేస్తున్నారు.

Next Story