శాంసంగ్ యూవీ స్టెరిలైజర్‌తో గాడ్జెట్స్‌ శానిటైజ్

by  |
శాంసంగ్ యూవీ స్టెరిలైజర్‌తో గాడ్జెట్స్‌ శానిటైజ్
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఒక చిన్న పొరపాటు వల్ల కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసరాల కోసం బయటకెళ్తే.. తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నా.. గ్యాడ్జెట్ విషయంలో ఓ చిన్న అనుమానమైతే ఉంటుంది. అందుకే వాటిని కూడా శానిటైజ్ చేస్తున్నాం. ఇందుకోసం ఎన్నో రకాల యూవీ స్టెరిలైజెర్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే, వీటికి పోటీగా ఇప్పుడు ప్రముఖ కన్య్జూమర్ ఎలక్ట్రానిక్ అండ్ మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’ కూడా ఈ సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది. కొత్తగా యూవీ స్టెరిలైజర్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

శాంసంగ్ తీసుకొచ్చిన యూవీ స్టెరిలైజర్‌తో స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌, కీస్‌, సన్ గ్లాసెస్‌ను కేవలం 10 నిమిషాల్లోనే శానిటైజ్ చేయవచ్చు. ఇది వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో రావడం విశేషం. ఈ యూవీ స్టెరిలైజర్ కిట్ బాక్స్‌‌లాగా ఉంటుంది. ఆ బాక్స్‌లో ఫోన్లు లేదా ఇతర వస్తువులను ఉంచితే వాటిపై ఉండే 99 శాతం బాక్టీరియా, వైరస్‌లు నాశనం అవుతాయి. ఈ డివైస్‌పై ఓ చిన్న బటన్‌ను ఏర్పాటు చేశారు. అదే ఆన్, ఆఫ్ బటన్‌‌గా పనిచేస్తుంది. 10 నిమిషాల్లో శానిటైజ్ చేసేసి.. ఆటోమేటిక్‌గా డివైజ్ ఆఫ్ అవుతుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటు‌లో ఉన్న ఈ శాంసంగ్ యూవీ స్టెరిలైజర్‌ ధర రూ.3,599/-.


Next Story

Most Viewed