సామ్ వర్కవుట్ సీక్రెట్స్.. ‘ఆల్ ఇన్ 60 సెకండ్స్’

by  |
సామ్ వర్కవుట్ సీక్రెట్స్.. ‘ఆల్ ఇన్ 60 సెకండ్స్’
X

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే.. జిమ్‌లో వర్కవుట్లకు తగినంత సమయాన్ని కేటాయిస్తుంది సమంత. తెరపై గ్లామరస్‌గా కనిపించడం ఎంత ముఖ్యమో, మన మనసు కూడా అంతే అందంగా ఉండటం అవసరమని చెబుతుంటుంది. తాను ఫిట్‌గా ఉండేందుకు కారణం తన ట్రైనరే అని ఈ బ్యూటీ క్వీన్ చాలాసార్లే చెప్పుకొచ్చింది. ఇక లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో ఉంటూనే.. ఆన్‌లైన్‌లో వీడియో కాల్ ద్వారా ట్రైనర్ సందీప్ రాజ్ సూచనలు తీసుకుని ఫిట్‌నెస్ సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తోంది. ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకునే వారికోసం వర్కవుట్ సీక్రెట్ ‘ఆల్ ఇన్ 60 సెకండ్స్’ పేరుతో ఓ ఫోటో షేర్ చేసుకున్నారు సమంత.

ఈ ఫోటోకు జతగా ‘వి వర్కవుట్ టిల్ వి బర్న్ అవుట్.. ఆల్ ఇన్ 60 సెకండ్స్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇందులో సమంతతో పాటు తన ముద్దుగా పెంచుకుంటున్న ‘హష్’ అనే శునకం కూడా కనిపిస్తుంది. ఇటీవలే రానా, మిహికాల ‘రోకా’ వేడుకలో నాగ్ చైతన్య ఫోటోనూ షేర్ చేస్తూ.. మా ఆయన ఎంతో హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా? అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed