చైతుతో విడాకులు పరోక్షంగా కన్‌ఫర్మ్ చేసిన సామ్.. ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్

4257
Samantha Tweet

దిశ, సినిమా : టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య – సమంతల డైవొర్స్ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో సామ్ నుంచి ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్ వచ్చినా సరే చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో లేటెస్ట్‌గా రిలీజైన చైతు – సాయి పల్లవిల ‘లవ్ స్టోరి’ ట్రైలర్‌పై స్పందించిన సామ్.. ‘విన్నర్.. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్’ అని చెప్పింది. అంతేకాదు ట్వీట్‌లో సాయి పల్లవిని మెన్షన్ చేసిన సామ్.. చైతుకు ఎలాంటి అప్రిసియేషన్ ఇవ్వకపోవడంపై నెట్టింట డిస్కషన్ జరుగుతోంది. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్న ఓ వర్గం.. చైతు పేరును ప్రస్తావించకపోవడంపై ఫైర్ అవుతోంది. మరోవైపు విడాకులపై పరోక్షంగా కన్‌ఫర్మ్ చేసినట్టేనా అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చైతు ట్వీట్‌నే కోట్ చేసింది కదా.. తన గురించి ఎలా చెబుతుందని మరో వర్గం సామ్‌ను సమర్థిస్తుంది. మొత్తానికి చై-సామ్‌లు ఎప్పటికీ కలిసే ఉండాలని ఫొటోలు షేర్ చేస్తున్న మరికొందరు.. ఈ విడాకుల టాపిక్ గురించి మాట్లాడకపోతేనే మంచిదని చెబుతున్నారు.

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్

https://twitter.com/Samanthaprabhu2/status/1437360234285056001?s=20

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..