నాగ చైతన్యకి ఊహించని షాక్.. సామ్‌ అలా చేసిందేంటి..!

789

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం నాగచైతన్య అభిమానులు సమంతపై గుర్రుగా ఉన్నారు. అసలు సమంత ఏమనుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో అమ్మడిపై నిప్పులు కక్కుతున్నారు. నవంబర్ 23న నాగచైతన్య పుట్టిన రోజు సమంత విష్ చేయలేదు. దానికే కాస్త ఆగ్రహించిన చై ఫ్యాన్స్ అది సామ్ వ్యక్తిగతం అని సరిపెట్టుకున్నారు. కానీ ఆ తరువాత సమంత షాక్ ఇస్తూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది.

అసలు విషయానికి వస్తే.. సమంత తన మాజీ భర్త చై పుట్టినరోజున అతడిని విష్ చేయలేదు. కానీ తన పెంపుడు కుక్క ‘హష్’కు పుట్టిరోజు విషెస్ చెబుతూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ వీడియో పెట్టింది. ఆ పోస్ట్ చూసిన చై ఫ్యాన్స్ సమంతపై పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. చై అభిమానులు అమ్మడికి విమర్శలు, తిట్లతో సన్మానం చేస్తున్నారు. ‘పెంపుడు కుక్కకి అంత ప్రాధాన్యం ఇస్తున్నావు. మరి విడాకులు తీసుకునే ముందు స్నేహితుడని చెప్పిన నాగ చైతన్యను ఎలా మరిచిపోయావ్?’ అంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. కొందరు సమంత ఫ్యాన్స్ మాత్రం అమ్మడిని సపోర్ట్ చేస్తున్నారు. చై ఎంత బాధపెడితే సమంత విడాకులు తీసుకుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది అంటూ వారు అంటున్నారు.